మన టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లోని హీరో సిస్టర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా…చూస్తే అవాక్ అవ్వాల్సిందే…!!

టాలీవుడ్ సినిమాలలో చాలామంది అనేక పాత్రల్లో నటిస్తూ ఉంటారు. పాత్ర చిన్నదైనప్పటికీ.. దాంట్లో కాన్సెప్ట్ ఉంటే మాత్రం ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ లిస్టులో సోదరి పాత్ర ఒకటి. హీరోకు సోదరిగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన నటీనటులు సైతం ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది ఇండస్ట్రీలో కనిపిస్తుంటే.. మరికొందరు మాత్రం అడ్రస్ లేరు. అలా హీరోకి సోదరిగా నటించిన వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారు చూద్దాం.

1. సంధ్య:


ప్రేమిస్తే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం ” అన్నవరం ” సినిమాలో హీరోకి చెల్లెలిగా నటించింది. ఆ తరువాత పలు తమిళ్, మలయాళ చిత్రాలు సైతం చేసింది. 2015లో చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగి వెంకట్ ని వివాహం చేసుకుంది. అనంతరం ఈమెకు ఒక బిడ్డ కూడా జన్మించాడు. ఈమె ఆఖరిగా మలయాళం సినిమాలో కనిపించింది.

2. మౌనిక:


శివరామరాజు సినిమాలో ముగ్గురు సోదరుల చెల్లిగా నటించింది. అనంతరం 2014 లో మౌనిక ఇస్లాంలోకి మారి తన పేరును రహీమాగా మార్చుకుంది. 2017లో చెన్నై బెస్ట్ బిజినెస్ మాన్ మాలిక్ ని వివాహం చేస్తుంది.

3. మంజూష:


రాఖి లో ఎన్టీఆర్ కి చెల్లిగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అనంతరం అనేక సినిమాల్లోనూ ఆఫర్స్ కొట్టేసింది. అలా వెండితెరపై మెరిసిన ఈమె.. ప్రస్తుతం యాంకర్ గా పనిచేస్తుంది.

4. శరణ్య మోహన్:


శరణ్య మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. అనంతరం టాలీవుడ్ లో అడుగు పెట్టింది. విలేజ్ లో వినాయకుడు, హ్యాపీ హ్యాపీ సినిమాల్లో కథానాయకగా నటించి బాగా ఆకట్టుకుంది. కత్తి సినిమాలో కళ్యాణ్ రామ్ కి సిస్టర్ గా కనిపించింది. 2017లో అరవింద్ కృష్ణను వివాహమాడింది. వీరికి ఒక పాప కూడా జన్మించింది.

5. వర్ష:


ఈమె ” వాసు ” సినిమాలో హీరోకి చెల్లెలుగా నటించింది. అనంతరం ఈటీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. తరువాత కొంతకాలం విరామం తీసుకుని ప్రస్తుతం మళ్లీ సీరియల్స్ లో కొనసాగుతుంది.

ఇలా హీరోకి చెల్లెలు పాత్రలో నటించి మంచి పేరు పొందారు. చెల్లెలు పాత్ర మన నిజ జీవితంలోనే కాదు… సినిమాల్లో సైతం మంచి పేరే దక్కిస్తుంది. చెల్లిలు పాత్రలతో ఈ ముద్దుగుమ్మల భవిష్యత్తు మారిందనే చెప్పాలి.