మెగా డాటర్ శ్రీజ మనందరికీ సుపరిచితమే. ఈమె ఎల్లప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటది. ఈమె గతంలో ఓ యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుని.. మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయింది. అనంతరం ఓ కూతురు కూడా జన్మించింది. ఆ తరువాత ఏవో కారణాలు వల్ల విడాకులు తీసుకుని.. మెగా కుటుంబంలో చేరింది.
అనంతరం చిరంజీవి ఆమెను ఆదరించి హీరో కల్యాణ్ దేవ్ కు ఇచ్చి వివాహం చేశాడు. వీరిద్దరికీ కూడా ఒక కూతురు జన్మించింది. అయితే గత కొద్ది కాలంగా.. వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటిపై మెగా ఫ్యామిలీ కానీ, కల్యాణ్ దేవ్ కానీ స్పందించలేదు. కానీ ప్రస్తుతం కల్యాణ్ దేవ్ తన కూతురుని మిస్ చేసుకుంటున్నట్లు.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ అప్లోడ్ చేశాడు.
” నేను 100% కాన్ఫిడెంట్స్ తో చెబుతున్నాను. మా అమ్మ ప్రార్థనలు.. నా జీవితాన్ని నేను ఊహించిన దానికంటే ఎక్కువగా మార్చాయి ” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ని చూసిన ప్రేక్షకులు…” వీరిద్దరూ కలిసిపోయి.. సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలి. కల్యాణ్ కి శ్రీజ తో కలవాలని ఉంది. కానీ శ్రీజ మాత్రం చాలా ఓవర్ చేస్తుంది. తన ఆవేదన పోస్ట్ రూపంలో పెట్టాడు..” అంటూ శ్రీజని తిట్టిపోస్తున్నారు.