” ఆ ఆట ఆగితే కానీ మ ఆటలు సాగవు “… డైరెక్టర్ చేసిన కామెంట్లు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే…!!

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటిస్తున్న సినిమా ” ఆదికేశవ “. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి.. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం నవంబర్ 24న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా రిలీజ్ డేట్ ముందు.. నవంబర్ 10న అనుకున్నప్పటికీ.. అనంతరం పోస్ట్ పోన్‌ చేశారు. ఈ విషయాన్ని నేరుగా నాగవంశీయే ప్రకటించాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..” ప్రస్తుతం వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మ్యాచ్ ల ప్రభావం సినిమాలపై పడుతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు.

నాగ వంశి ఇంకా మాట్లాడుతూ…. ” ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి అస్సలు ఉండదు. అందుకే మా సినిమాను నవంబర్ 24 కిపోస్ట్ పోన్‌ చేశాము..” అంటూ పేర్కొన్నాడు. ఈ ఈయన వ్యాఖ్యలపై స్పందించిన ప్రేక్షకులు…” మీ సినిమా కోసం కాకపోయినా.. మెగా హీరో ఉన్నాడని రెస్పెక్ట్ తో అయినా వస్తాము. అది మెగా ఫ్యామిలీ పై మాకున్న అభిమానం…” అంటూ కామెంట్లు చేస్తున్నారు.