ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావడానికి శోభతో పోటీ పడుతున్న ఆ టాప్‌ కంటెస్టెంట్.. అస‌లు ఊహించ‌లేరు..

బిగ్‌బాస్ సీజన్ 7.. ఉల్టా పల్టా కాన్సెప్ట్ రిలీజ్ అయ్యి కొత్త కొత్త సర్ప్రైజ్లు, వైల్డ్ కార్డు ఎంట్రీలు, కొత్త కంటెంట్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ షో పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే నిన్న మొన్నటి వరకు వరుసగా లేడీ కంటిస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్న బిగ్ బాస్ హౌస్ లో.. తాజాగా గతవారం డాన్స్ మాస్టర్ సందీప్ ఎలిమినేటై ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈసారి నామినేషన్స్లోకి శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్‌ మరియు అశ్విని తప్ప హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. వీరిలో ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని చాలామంది అభిప్రాయం. ఈ విషయం ఆమెకి కూడా తెలుసు.

కాబట్టి ఈ వీక్‌ మొత్తం డల్ అయింది. మొన్న వారాల వరకు ఉన్నంత పొగరు, యాటిట్యూడ్ ఇప్పుడు అసలు ఆమెలో కనిపించడం లేదు. మొన్నటి వరకు చూసిన శోభా శెట్టి ఈమె ఒకటి కాదు.. ఇప్పుడు ఉన్నట్టు శోభ శెట్టి మొదటి నుంచి ఉంటే కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ సీజన్ ఉల్టా పల్టా అనే విషయం తెలిసిందే. మొదటి నుంచి హౌస్ మేట్స్ కోరుకున్నట్లు.. ప్రేక్షకులు ఊహించినట్టు.. అదే రేంజ్‌లో కిక్ ఇస్తూ బిగ్ బాస్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక ఈవారం కూడా ఏదో కొత్త సంఘటన జరగబోతుంది అంటూ అర్థమవుతుంది.

ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభమై 8 వారాలు పూర్తి అయిన ఇంకా హౌస్ లో 11 మంది ఉన్నారు. కచ్చితంగా ఏదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అది ఈ వారమే జరిగే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం శోభాశెట్టితో పాటు టేస్టీ తేజ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. ఈసారి హౌస్ లో లవ్ ట్రాక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. అలాంటి జంట ఇద్దరు ఒకేసారి ఎలిమినేట్ అయితే తప్పేముండదులే అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే తేజ హౌస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ పంచే వ్యక్తి. ఇప్పుడు తేజ ఎలిమినేట్ అయితే షోలో కాస్త ఎంటర్టైన్మెంట్ అయితే తగ్గుతుంది. టిఆర్పి రేటింగ్స్ పై ప్రభావం కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉందో..? లేదో..? వేచి చూడాలి.