Sharukh birthday spl: ఇండియా నెంబర్ వన్.. షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లు తెలిస్తే నూరేళ్లబెడతారు..!!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖ్ఖాన్ బుల్లి తెర‌ నటుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు.1988లో ప్రసారమైన ఫాజీసీరియల్తో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 1992 లో రిలీజ్ అయిన దివాన్ సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. బాజిగర్, దూర్, డి డి ఎల్ జి , కుచ్ కుచ్ హోతా హై, పటాన్, జవాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కింగ్ కాంగ్, కింగ్ ఆఫ్ బాలీవుడ్ లాంటి ఎన్నో బిరుదులను సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ తన టాలెంట్ తో బాలీవుడ్ బాద్‌షాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేడు బాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వకారణంగా షారుక్ నిలిచాడు. అయితే ఇవాళ షారుక్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా విషెస్ తెలియజేస్తున్నారు.

ఇక షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి దాదాపు రూ.6,300 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిని సంపాదించారట. భారతదేశంలోనే అత్యంత ధనవంతుల హీరోలలో షారుక్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. సంవత్సరానికి రూ.280 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. షారుక్ సినిమాలకు బ్రాండ్ ప్రమోషన్స్ కు అలాగే వ్యాపార సంస్థల నుంచి డబ్బు సంపాదిస్తున్న బాలీవుడ్ బాద్‌షా ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అలాగే కొన్ని సినిమాల లాభాల్లో కూడా షారుక్ కి వాటా ఉంటుంది.

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటులలో షారుక్ ఒక‌డు. ఇక షారుక్ సినిమాలో నటించాడు అంటే కచ్చితంగా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. అలాగే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా షారుక్ వ్యవహరిస్తున్నాడు. ఒక బ్రాండ్ ప్రమోషన్ కు దాదాపు రూ.10 కోట్ల వరకు రమ్యున‌రేషన్ తెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా షారుక్ ఖాన్ కు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ హౌస్ కూడా ఉంది. ఈ నిర్మాణ సంస్థతో చాలా సినిమాలు రూపొందిస్తున్నాడు. వీటి ద్వారా షారుక్ ప్రతి సంవత్సరం రూ. 5కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. ఇక షారుక్ కి రూ.9,017 కోట్ల రూపాయల విలువ చేస్తే ప్రైవేట్ జట్టు కూడా ఉంది. ఇక కార్ కలెక్షన్ల ధరలు రూ.31 కోట్లకు మించే ఉంటుందట.