విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” రిలీజ్ పై స్ట్రాంగ్ బజ్… మామూలుగా లేదుగా…!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మనందరికీ సుపరిచితమే. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్న ఈయన…” అర్జున్ రెడ్డి ” సినిమాతో రౌడీ హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక తాజాగా విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మూవీ ” ఫ్యామిలీ స్టార్ “.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక మేకర్స్ ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ పై ఆల్రెడీ కావాల్సిన బజ్ ని తెచ్చుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దింపనున్నారు. అయితే డేట్ ఇంకా ఫిక్స్ కాకపోయినప్పటికీ.. సంక్రాంతికి అయితే పక్క అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన ఓ స్ట్రాంగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అయినట్లుగా సమాచారం. ఇక ఇది ఎంతవరకు నిజం అనేది తెలియకపోయినా.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజ్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.