కోట్లాదిమంది మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఆయన నెక్స్ట్ సినిమా ఈగల్ కి సంబంధించిన టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ హీరో రవితేజ నటిస్తున్న తాజా సినిమా ఈగల్ . ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది .
ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం . కాగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఆ వీడియో చూసిన తర్వాత సినిమా మొత్తం యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కబోతుంది అంటూ క్లియర్ కట్గా అర్థమయిపోయింది. అంతేకాదు ఈ సినిమా రవితేజ కెరియర్ లో మళ్ళీ ఆయనకు పునర్ వైభవం అందజేస్తుంది అంటూ రిలీజ్ అయిన టీజర్ ఆధారంగా చెప్పేయొచ్చు.
రవితేజను ఆయన అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో ..? అదే విధంగా ఈ సినిమాలో కార్తీక్ ఆయన చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా అర్థం అయిపోతుంది. రవితేజ లుంగీ కట్టి ..తుపాకీ చేత పట్టి ఊర నాటు మాస్ డైలాగ్స్ చెప్తుంటే ఆ ఫీలింగ్ మరో లెవల్ అనే చెప్పాలి . ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరణ్ రవితేజకు జోడిగా నటిస్తుంది . కావ్య ధాపర్ సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది . మధుబాల , నవదీప్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. రిలీజ్ అయిన టీజర్ ఆధారంగా సినిమా రవితేజ కెరియర్ లోనే మరో హిట్ గా నిలవబోతోంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈగల్ సంక్రాంతికి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.