పూర్తిగా మగరాయుడిలా మారిపోయిన కీర్తి సురేష్.. అంత ఆ హీరో మహిమ(వీడియో)..!!

కీర్తి సురేష్ ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మహానటిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్న కీర్తి సురేష్ ప్రెసెంట్ బాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . తెలుగులో తాజాగా నటించిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ అయింది . ఈ క్రమంలోనే తెలుగు సినిమాలకి దూరంగా ఉంటూ బాలీవుడ్ సినిమాలకు సైన్  చేస్తున్న కీర్తి సురేష్..

తాజాగా చెన్నైలోని ఓ బీచ్ లో మహీంద్రా ధార్  నడుపుతున్న వీడియోను పోస్ట్ చేసింది . సినిమాల్లో హీరోలు చేసింగ్ సీన్ లల్లో  నడిపినట్లు .. బీచ్ ఇసుకలో కీర్తి సురేష్ ఓ రేంజ్ లో స్టైలిష్ గా ఆ జీప్ ను నడిపింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది . దీంతో కొందరు కీర్తి సురేష్ లోనే టాలెంట్ ని ప్రశంసిస్తుంటే..

మరికొందరు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కుందనపు బొమ్మలా ఉన్నావు .. బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లాక పూర్తిగా మగ రాయుడిలా తయారయ్యావు.. అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . ప్రజెంట్ కీర్తి సురేష్ జీప్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్స్ ఇలా నడపడం చాలా రేర్ అందుకే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది..!!