“అలా చేయకపోతే బాహుబలి 2 లో నటించను”.. ఆ విషయంలో జక్కన్న ను ముప్పుతిప్పలు పెట్టిన ప్రభాస్..!!

బాహుబలి .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన సినిమా బాహుబలి.  ప్రభాస్ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా బాహుబలి . రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది  అంటే దానికి కారణం బాహుబలి . ఇలా ఎంతో మంది లైఫ్ని టర్న్ చేసిన బాహుబలి సినిమా ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా సరే తనివి తీరదు . చూస్తున్న ప్రతిసారి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.  అదంతా డైరెక్టర్ రాజమౌళి మహిమనే చెప్పాలి .

ఈ సినిమా రాజమౌళికి ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో ప్రభాస్కి సైతం అంతే బ్రేక్ ఇచ్చింది.  అయితే ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ జక్కన్నకు ఓ క్రేజీ కండిషన్ పెట్టాడట . “ప్రతి సినిమా విషయంలో డైటింగ్ అంటూ నన్ను చంపేస్తున్నావు..  ఈ సినిమా విషయంలో డైటింగ్ అంటే ఒప్పుకోను .. నీతో వర్క్ చేసే టైంలో మాత్రమే డైటింగ్ చేస్తాను ..మిగతా  టైం లో నాకు కావాల్సిన ఫుడ్ నేను తింటాను.. అందుకు నువ్వు ఒప్పుకుంటేనే బాహుబలి 2 చేస్తాను లేదంటే బాహుబలి 1 తోనే ఆపేస్తాను “అంటూ ఫన్నీగా బెదిరించారట .

ప్రభాస్ పరిస్థితిని అర్థం చేసుకున్న జక్కన్న ఫైనల్లీ ఆయన అడిగిన ఒకే ఒక కండిషన్ ని యాక్సెప్ట్ చేశారట . కానీ ప్రభాస్ మాత్రం ఏనాడు చీట్ మీల్ చేయలేదట.  షూట్ ఉన్న రోజు కఠినంగా ఆయన చెప్పిన ఫుడ్ డైట్ ని ఫాలో అయ్యారట . మిగతా టైంలో మాత్రం ప్లేట్ నిండా నాన్ వెజ్ ఐటమ్స్ తో కుమ్మి కుమ్మి పడేసాడట ప్రభాస్..!!