వావ్: ఆఫ్టర్ ఏ లాంగ్ టైం..మహేశ్ బాబు సినిమాలో త్రిష.. ఆ స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లోనే..!

వావ్ .. ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకు బిగ్ బిగ్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ క్రేజీ కంబో రిపీట్ కాబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . హీరోయిన్ త్రిష హీరో మహేష్ బాబు .. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు . ఫామిలీ ఆడియన్స్ ని బాగా ఈ సినిమా ఆకట్టుకుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా అందుకుంది . కాగా మరోసారి ఇదే కాంబో తెరపై కనిపించబోతుంది అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్గా సినీ వర్గాలల్లో హల్చల్ చేస్తుంది . మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా లో అతడు సినిమాకి సంబంధించిన త్రీ క్లిప్స్ యాడ్ చేశారట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.

కధ అనుసారం అక్కడ ఆ త్రీ క్లిప్స్ యాడ్ చేస్తే సినిమాకి మంచి హైప్ వస్తుందంటూ త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారట . దీంతో మరోసారి తెరపై అతడు కాంబో రిపీట్ కాబోతుంది అన్న వార్త వైరల్ అవుతుంది. మొత్తానికి త్రివిక్రమ్ గుంటూరు కారం తో అతడు కి మించిన హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి బాగానే కష్టపడుతున్నాడు..!!