100 పచ్చి గుడ్లను ఒకేసారి తాగిన యూట్యూబర్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని బైద్యులు చెపుతూ ఉంటారు. ప్రతిరోజు ఒక గుడ్డును తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది అని అంటూ ఉంటారు. జ్ఞాపకశక్తి పెరగడానికి మెదడులోని కణజాల ఆరోగ్యం మెరుగుపరచడానికి గుడ్డు ఎంతగానో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్డు సహకరిస్తుంది. పిల్లలు ఎదగడానికి తోడ్పడే బలమైన ఆహారంలో గుడ్డు ఒకటి. ఎముకలను దృఢంగా తయారు చేయడానికి గుడ్డు బాగా సహకరిస్తుంది. అందుకే కొందరు రోజు ఉడికించిన గుడ్డును పిల్లలకు తినిపిస్తూ ఉంటారు.

మరికొందరు మాత్రం పచ్చి గుడ్లను తాగుతూ ఉంటారు. పచ్చి గుడ్లను తాగడం కొంత కష్టమే అయినా వ్యాయామం చేసేవారు ఇలా పచ్చి గుడ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక గుడ్డు తాగడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఓ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఏకంగా 100 పచ్చి గుడ్లను ఒకేసారి తాగి సోషల్ మీడియా ప్రేక్షకులను షాక్ ఇచ్చాడు. త‌న ఛాన‌ల్‌కి లక్ష ఫాలోవర్స్ వచ్చినందుకు 100 పచ్చి గుడ్లను ఒకేసారి తాగుతూ ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు.

జిమ్ సెంటర్లోనే నిలబడి ఓ పెద్ద మగ్గినిండా పచ్చి గుడ్లను నింపుకున్నాడు. మగలో గుడ్ల మిశ్రమాన్ని తాగటం మొదలుపెట్టాడు. సగం తాగాక చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళి తాగాడు. తర్వాత మగ్గు పక్కన పెట్టి పుష్అప్ చేశాడు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి తాగడం మొదలుపెట్టాడు. ఇలా మగ్‌లోని మొత్తం 100 గుడ్ల మిశ్రమాన్ని యూట్యూబర్ కంప్లీట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Vince Iannone (@vince_aesthetic)