అప్పుడు ఉపాసన ..ఇప్పుడు లావణ్య.. మెగా కోడలు బ్యాక్ టూ బ్యాక్ అదే తప్పు చేస్తున్నారుగా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి లావణ్య త్రిపాఠి పేరు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా ఈ జంటకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పర్సనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉండడంతో జనాలు ఈగర్ గా ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ఉత్సాహపడుతున్నారు.

ఈ జంటకు మొన్నే పెళ్లయింది . అయితే అప్పుడే ఈ జంట బిడ్డల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.  మెగా కోడలుగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి పిల్లల విషయంలో తన అక్క ఉపాసన ని ఫాలో అవుతుందట . “పిల్లల్ని పెంచాలి అంటే ఒక ఏజ్ రావాలి అని .. మన మైండ్ మెచ్యూర్ ఉండాలి అని .. అప్పుడే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అని .. గతంలో ఉపాసన ఇంటర్వ్యూలో చెప్పింది “.

ఆ విషయాలను బాగా బుర్రకెక్కించేసుకున్న లావణ్య తను కూడా పిల్లల విషయంలో అలాంటి డెసిషన్ తీసుకుందట . “మాది చాలా చిన్న వయసు ఇంకా బోలెడు టైం ఉంది.. నెమ్మదిగా ప్లాన్ చేసుకుంటాం .. ప్రెసెంట్ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి చూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చిందట “. అంతేకాదు ఉపాసన తీసుకొని నిర్ణయం పై మెగా ఫాన్స్ అప్పట్లో ఎంత ఫైర్ అయ్యారో మనం చూసాం. మళ్లీ అదే నిర్ణయం తీసుకుంది లావణ్య అని తెలియడంతో మెగా ఫాన్స్ ఈమెపై కూడా గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ మెగా ఇంటికె కోడలుగా ఎలా వెళ్తారు రా బాబోయ్ అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు..!!