ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి ఏవో ఒక వార్తలు దుష్ప్రచారాలు వైరల్ అవుతూనే ఉంటాయి. అది కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన తర్వాత నిజాలు, అబద్ధాలు అనే తేడా లేకుండా దుష్ప్రచారాలు, ఆ వాస్తవాలు కూడా చాలా ఎక్కువగా సమాజంలోకి వెళ్తున్నాయి. ఇలాంటి అంశాలు చాలామందిని బాధపెడుతున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కావాలనే కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇటీవల యాక్టర్ రష్మిక పై డిప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి అసభ్యకర చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఇక యాక్ట్రెస్ మమతా మోహన్ దాస్ కు కూడా అలాంటి అవమానం జరిగింది. కాకపోతే ఇది వేరే పరిస్థితి. చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన మలయాళ బ్యూటీ మంచి సింగర్ గా కూడా ప్రేక్షకులకు పరిచయమే. శివన్ మూవీ ద్వారా విశాల్‌కు జంటగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పని సినిమాల్లో నటించడంతోపాటు పాటలు కూడా పాడి మెప్పించింది. యమదొంగ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ఈమె తెలుగు, కన్నడ భాషల్లోనూ పాపులర్ అయింది. అలాంటి మమతా మోహన్ దాస్ క్యాన్సర్ బారిన పడి దానిపై పోరాడి గెలిచింది. ఇక తాజాగా మమత మోహన్ దాస్ మళ్ళీ నటనపై దృష్టి సారిస్తుంది.
ప్రస్తుతం మలయాళ, తమిళ భాషల్లో బిజీగా గడుపుతుంది. కాగా ఈ క్రమంలో గీతం నాయర్ అనే వ్యక్తి మమతా మోహన్ దాస్ పై చెడు ప్రచారం చేసే విధంగా ఒక కథనాన్ని రాసి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక బతకలేను చావుకి లోంగి పోతున్నానంటూ నటి మమతా మోహన్‌దాస్‌ది ఇదే దుర్భర జీవితం అనే టైటిల్ తో వార్తను ప్రచురించింది. ఈ వార్త గీతం యొక్క డూప్లికేట్ ప్రొఫైల్ ద్వారా షేర్ చేయబడింది. ఇందులో నటి మమత మోహన్ దాస్‌ను కించపరిచే విధంగా న్యూస్ రాసింది.
అది ఒక్కసారిగా కోలీవుడ్ తో పాటు మలయాళ పరిశ్రమలో కూడా వైరల్ అయింది. దానిపై మమతా మోహన్ దాస్ ఫైర్ అయ్యారు. పాపులార్టీ కోసం, ఇతరుల దృష్టిని ఆకర్షించుకోవడం కోసం మాపై రుద్దాలని అసత్యాలు రాయడం సరికాదు. అసలు నువ్వు ఎవరు..? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు..? మీ పేజీపై అందరి దృష్టి ఆకర్షించడానికి నేను ఏదైనా చెప్పాలా..? ఇలాంటి డూప్లికేట్ పేజ్‌లను ఫాలో అవకుండా జాగ్రత్తపడండి. ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అంటూ మమత మోహన్ దాస్ కామెంట్ చేసింది.