బిగ్ షాకింగ్: ఫ్యాన్స్ ఊహించని నిర్ణయం తీసుకున్న రష్మిక.. సపోర్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ..!?

రష్మిక మందన్నా.. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం.  ఓ పక్క శ్రీల మరోపక్క రష్మిక  టాలీవుడ్ ఇండస్ట్రీని చెడు గుడు  ఆడేసుకుంటున్నారు . అయితే శ్రీ లీల లేదంటే రష్మిక మందన్నా  ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ ఇదే పేర్లను జపిస్తున్నారు . రీసెంట్ గా రష్మిక బిగ్ బోల్డ్ స్టెప్ తీసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి .

రష్మిక మందన్నా  క్రేజ్ ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అలాంటి రష్మిక మందన్నా  ఏకంగా టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణతో సినిమాను యాక్సెప్ట్ చేసింది అన్న వార్త వైరల్ అవుతుంది. రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో కి తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రష్మిక మందన్నా  బాలయ్యతో నటించాలని ఉంది అంటూ కోరికను బయటపెట్టింది.

అంతేకాదు ఆ కోరికను డైరెక్టర్ సుకుమార్ తీర్చబోతున్నాడు అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. బాలయ్య బాబి దర్శకత్వంలో సినిమా తర్వాత సుకుమార్ తో చేయబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రష్మికను చేయమంటూ సజెస్ట్ చేశారట సుకుమార్ . ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా రష్మిక కూడా ఓకే చేసిందట . అంతేకాదు ఈ గెస్ట్ రోల్ కోసం విజయ్ దేవరకొండ – రష్మిక కలిసి నటించబోతున్నట్లు తెలుస్తుంది . ఇది నిజంగా ఫాన్స్ అస్సలు ఊహించలేదు . అయితే దీనికి విజయ్ దేవరకొండ కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం  గమనార్హం ..!!