రవితేజ స్టార్ హీరోగా ఎద‌గ‌డానికి ఆ హీరోనే కారణమా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజ గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో ఇప్పటికే స్టార్ హీరోగా కొనసాగుతున్న రవితేజ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూనే తన సత్తా చాటుకుని హీరోగా అవకాశాలను అందుకున్నాడు. ఇక రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ ఏడాది భారీ కలెక్షన్ సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మదర్ సెంటిమెంట్, యాక్షన్స్ స‌నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ మూవీలో ఆసిన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు మొదటి ఛాయిస్ రవితేజ కాదట. తమిళ హీరో శ్రీ రామ్‌ని ఇందులో హీరోగా తీసుకోవాలని మొదట మువి టిమ్ అనుకున్నారట. అఫీషియల్ గా కూడా ఈ సినిమాని అతనితో అనౌన్స్మెంట్ చేశారట. కానీ ఫైట్స్ తో కూడిన మాస్ క్యారెక్టర్ కు న్యాయం చేయలేకపోతున్నానానే ఉద్దేశంతో శ్రీరామ్ ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతని ప్లేస్ లో పవన్ కళ్యాణ్ తీసుకోవాలని భావించాడట పూరీ జగన్నాథ్. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో రిజెక్ట్ చేశాడు.

దీంతో రవితేజను సెలెక్ట్ చేసుకున్నాడు. అలా శ్రీరామ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమాను వదులుకోవడం వల్లే రవితేజ కెరీర్‌ర్ మలుపు తిరిగింది. ఈ సినిమాని వదులుకున్నట్లుగా ఇటీవలే హీరో శ్రీరామ్ ఇంటర్వ్యూలో వివరించాడు. ఈ సినిమాతో పాటు మణిరత్నం లాంటిది దిగ్గజ దర్శకుడు సినిమాని కూడా తాను రిజెక్ట్ చేశాడట. ఇక ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై వచ్చిందంటే ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జ‌య‌సుధ‌ లాంటి వారు కీల‌క పాత్రలో నటించారు.