కార్తీక మాసంలో ఉదయాన్నే స్నానాలు చేయడం వెనుక సైన్స్ ఏం చెబుతోందంటే..?

కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల చాలామందికి ముక్తి లభిస్తుందని పండితులు సైతం తెలియజేస్తూ ఉంటారు. నెల రోజులుగా కార్తీక స్నానాలు చేయడం వల్ల బద్ధకం తగ్గిపోతుందట.. మనం సాధారణంగా స్నానం చేసినట్లు అయితే నీటిగా శుభ్రంగా ఉంటాము.. అయితే కొన్ని నెలల్లో స్నానాలు చేయడం వల్ల కూడా ప్రత్యేకత ఉంటుందని పలువురు పండితులు తెలియజేస్తున్నారు. కార్తీక మాసంలో చేసి స్నానాలు గురించి ఇప్పుడు పూర్తి వివరాలను సైతం మనం తెలుసుకుందాం.

బ్రహ్మ ముహూర్తంలో కాలువలు, చెరువలు లేదా బావుల వద్ద నీటితో స్నానం చేసినట్లయితే చాలా మంచిదని పలువురు పండితులు తెలుపుతున్నారు. ఈ కార్తీకమాసంలో స్నానాలు ఇలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉంటాయట. కార్తీక మాసం రాగానే చలి కూడా మొదలవుతుంది. అయితే ఈ చలిలో చాలామంది బద్ధకంగా ఉంటారు. ఉదయాన్నే లేచి స్నానం చేయడం వల్ల నిద్ర మత్తు పోయి చాలా యాక్టివ్ గా ఉంటారు. కార్తీక మాసంలో సూర్యుడు తులా రాశిలో ఉంటాడు కాబట్టి వేడి చాలా తక్కువగా ఉంటుందట.

సమయానికి తగ్గ వర్షాలు కాలువలో నీటి ఉధృతి తగ్గి ఈ నీటిలో చాలా మలినాలు కిందికి చేరడం వల్ల స్వచ్ఛమైన నీరుగా తయారవుతాయి.ఈ నీటిలో ఉండే ఔషధ గుణాలు మనలో ఎన్నో ఆరోగ్య సమస్యలను సైతం నయం చేసేలా చేస్తాయి. అందుకే ఈ నీళ్లతో స్నానం చేస్తే పుణ్యమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే మన పూర్వీకులు సైతం కార్తీక మాసంలో ఎక్కువగా నదుల వద్ద సముద్రాల వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు సైతం చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసిన తర్వాత శివాలయానికి వెళ్లడం మరింత మంచిదట.