ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే . మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడిపి ఆమె మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే పడింది .
ఆమెకు సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . అయితే విజయ్ దేవరకొండ తో ఆమె ఓ సినిమా చేయాల్సి ఉండిందని .. కానీ కథ నచ్చక రిజెక్ట్ చేసింది అన్న విషయం వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు గీత గోవిందం . పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠిని అనుకున్నారట. డైరెక్టర్ అప్రోచ్ కూడా అయ్యారట .
కానీ ఆమెకు ఈ కథ నచ్చక రిజెక్ట్ చేసిందట . ఒకవేళ నిజంగా విజయ్ దేవరకొండ లాంటి నాటీ హీరోతో నటించి ఉంటే కచ్చితంగా ఆమె కెరియర్ టర్న్ అయ్యుండేది . అంతేకాదు అసలు ఆమె మెగా కోడలు అయ్యుండే ఛాన్స్ కూడా ఉండేది కాదు అంటున్నారు అభిమానులు . ఆ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసింది అంటూ పొగిడేస్తున్నారు ..!!