మహేష్ బాబు – సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..

దివంగత నటి సౌందర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అప్పట్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య తన నటన, డాన్సులతో పాటు ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటూ కట్టు,బొట్టుతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న సౌందర్య ప్రమాదవశాత్తు వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన ఈమె 2004 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

దీంతో సౌందర్య అభిమానులు ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఆ మరణ వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఇక విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు – సౌందర్య కాంబినేషన్లో గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ మిస్ అయింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో డైరెక్టర్ సిమ్రాన్, సాక్షి శివానంద్ లను హీరోయిన్లుగా సెలెక్ట్ చేశాడు. కాగా మొదట సిమ్రాన్ ప్లేస్ కోసం సౌందర్యను అనుకున్నారట.

కానీ సౌందర్య మహేష్ బాబు కంటే వయసులో పెద్ద కాబట్టి వారి జోడి కెమిస్ట్రీ అంతగా వర్క్ అవుట్‌కాలేద‌ట‌. దీంతో ఆ ప్లాన్ ను విరమించుకున్నారట. అయితే మహేష్ బాబు సినిమా అనగానే సౌందర్య చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. కానీ ఫోటోషూట్ చేసిన తర్వాత ఎందుకో కెమిస్ట్రీ కుదరడం లేదు.. ఏ యాంగిల్ లో చూసిన సూపర్ స్టార్ కు అక్కలా ఉందని స్వయంగా సౌందర్య డైరెక్టర్ వైవిఎస్ చౌదరికి చెప్పి ఈ మూవీకి నాకంటే సిమ్రాన్ ఏ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆమెను సంప్రదించి కథ వినిపించండి అంటూ సజెస్ట్ చేసిందట.