సాధారణంగా చాలా మందికి విటమిన్ సి లోపం ఉంటుంది. దానివల్ల కలిగే చర్మవ్యాధులకు సైతం గురవుతాము. విటమిన్ సి లోపం ఉన్నవారికి ఏ విధంగా చర్మవ్యాధులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
1. పొడిబారిన అరచేతులు:
విటమిన్ సి లోపం ఉన్నవారిలో చర్మం పొడిబారిపోతుంది. ముఖ్యంగా అరచేతులలో చర్మం పొడిబారిపోతుంది.
2. గాయాలు మానడం:
కొల్లాజెన్ సింథసిస్ కు విటమిన్ సి చాలా అవసరం. గాయం అయిన ప్రాంతంలో కొత్త చర్మం రావడానికి కూడా ఇది సహాయపడుతుంది.
3. చర్మ సమస్యలు:
విటమిన్ సి లోపం వల్ల అనేక చర్మ సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల చర్మం రంగు మారిపోయినట్లు అయిపోతుంది.
4. చిగుళ్ళు వాపు:
విటమిన్ సి లోపం ఉన్న వారిలో చిగుళ్ళు పూయడం లాంటివి ఉంటాయి. అలాగే చిగుళ్ల నుంచి రక్తం కూడా వస్తుంది.
5. ముఖం కాంతి హీనంగా:
విటమిన్ సి లోపం వల్ల మన ముఖం కాంతి హీనంగా మారుతుంది.
ఈ సూచనలు మీలో కనబడితే…తప్పనిసరిగా విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. లేదంటే అనారోగ్యం బారిన పడవచ్చు. అందువల్ల విటమిన్ సి ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోండి.