తల్లి చనిపోయింది అని తెలిసినా.. షూటింగ్ పూర్తిచేసి మరీ వెళ్లిన చంద్ర మోహన్..ఆ సినిమా ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పాపులారిటి సంపాదించుకున్న చంద్రమోహన్ నేడు ఉదయం తిరిగి రాని లోకాలికి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే . తెలుగు – తమిళంలో హీరోగా నే కాకుండా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి.. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన చంద్రమోహన్.. హైదరాబాదులోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటూ ..ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు.

దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది . ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 932సినిమాలో నటించిన ఆయన 175కు పైగా సినిమాలలో హీరోగా రాణించారు . ఆయన సినిమాల పట్ల చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని చాలా మంది అంటుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నే ఇది.

ఆయన ఎంత డెడికేషన్ పర్సన్ అంటే ..ఆయన తన తల్లి చనిపోయింది అని తెలిసిన కూడా.. సినిమా షూట్ ని మధ్యలో ఆపకుండా..ఆ బాధను భరిస్తూ..షూటింగ్ ఆపద్దు అంటూ కంటిన్యూ చేయించి..ఆ తరువాత తన తల్లిని చూడటానికి వెళ్ళాడట. ఆ సినిమా మరేదో కాదు “మనసంతా నువ్వే”. ఈ సినిమాలో చంద్రమోహన్ పాత్ర అందరికి నచ్చుతుంది. చాలా రియలిస్టిక్ గా కూడా ఉంటుంది. అలా సినిమాల పట్ల ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు..!!