టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర వివాదం నెలకొంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ ఈరోజు ( శనివారం )ఉదయం కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం సోషల్ మీడియాలో తమ సంతాపం తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే కేసీఆర్, జగన్, చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇక తాజాగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. ” ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము” అని తారక్ రాసుకొచ్చాడు. అలాగే కళ్యాణ్ రామ్ ” విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాలలో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.