పండ్లు, కూరగాయలలో విటమిన్లు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి అనే సంగతి మనకి తెలిసిందే. కూల్ డ్రింక్స్ లతో పోలిస్తే పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిదే. కానీ పండ్ల నుంచి రసాలను తీయటం వల్ల కీలకమైన పీచును కోల్పోతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది.
ఆరోగ్యానికి పీచు ఎంతో అవసరం. కానీ మనం మాత్రం దాన్ని తీసుకోవడం లేదు. పండ్లు, కూరగాయలలో పీచును తీసేస్తే పోషకాలు కోల్పోయినట్టే. పీచు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. జీర్ణ క్రియ సాఫీగా సాగడానికి పీచు పదార్థాలు చాలా బాగా సహాయపడతాయి. పండ్ల లోని చక్కెర పీచుతో కలిసి ఉంటుంది. తద్వారా పండ్లలో నుంచి పీచును అస్సలు తీయకూడదు.
శరీరం పీచును త్వరగా జీర్ణం చేసుకోలేదు. కడుపు నిండిన భావనతో ఎక్కువ ఆహారం తినలేరు. అందువల్ల బరువు పెరగరు, శక్తి తగ్గదు. అందువల్ల పీచున్న పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ఇప్పటినుంచి అయినా పండ్ల నుంచి పీచు తీసేసి పండ్ల రసం తాగకుండా.. పీచుతోనే పండ్లను తినడం మేలు.