ప్రభాస్ ” సలార్ ” సినిమాపై యూనివర్సల్ క్లారిటీ… మళ్లీ అదే సీన్ రిపీట్…!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కనున్న మూవీ ” సలార్ “. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రవి బసృర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ పై రీసెంట్ గా ఓ బ‌జ్‌అయితే బయటికి వచ్చింది. ఈ మూవీ యూనివర్సల్ ట్రైలర్ను సింపుల్గా ఇంగ్లీషులో రెడీ చేసే ఆలోచనలో ప్రశాంత్ నిల్ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై ప్రభాస్ టీం తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది. ” ట్రైలర్ విషయంలో అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే అప్డేట్ అందిస్తాం ” అని తెలిపారు. ” కేజీఎఫ్ 2 ” ట్రైలర్ కూడా కేవలం ఇంగ్లీషులో రిలీజ్ చేయడంతో.. ప్రశాంత్ నీల్ మళ్లీ అదే పద్ధతి ఫాలో అవుతాడేమో అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.