సుమ స్టార్ యాంకర్ గా ఎదగడానికి ఇంత కష్టపడిందా.. రాత్రంతా బయట మెట్లపై నిద్రపోయేదా. ?!

టాలీవుడ్ స్టార్ యాంకర్ ఎవరు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. యాంకర్ గా కోట్లాదిమంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సుమ పలు సినిమాల్లో కూడా నటించింది. సుమ మొదట్లో ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో ఆయన అక్కగా కనిపించింది. ఆ తర్వాత యాంకర్ గా మారి స్టార్ గా ఎదిగింది. సినిమా ప్రమోషన్స్ అయినా, ప్రీరిలీజ్‌ ఈవెంట్స్ అయినా స్టార్ హీరోల అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది సుమ. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న సుమ‌ తెలుగు అమ్మాయి కాకపోయినా అచ్చం తెలుగు ఆడపడుచుల తన మాటకారితనంతో మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది.

ఇక ఇటీవల సుమా కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగైనా కొడుకును సక్సెస్ బాటలో నడిపించేందుకు సుమా అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇక ఇటీవల ఓ ఈవెంట్లో కొడుకుతో కలిసి సందడి చేసింది. దీపావళి స్పెషల్ గా ఓ టీవీ ఛానల్ లో ప్రోగ్రాం నిర్వహించింది సుమ. ఒకప్పటి యాంకర్ శిల్ప చక్రవర్తి కూడా ఇందులో హాజరైంది. ఇటీవల ఈ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో సుమ గురించి శిల్ప మాట్లాడుతూ కొన్నిసార్లు షూటింగ్ కు బాగా లేట్ అయ్యేదని.. ఇంట్లో వాళ్ళు తలుపు తీయకపోతే మెట్లే మీదే పడుకునేదని చెప్పుకొచ్చింది. నేను చాలా సార్లు సుమను అలా చూసానని వివరించింది శిల్పా. దీంతో ఆ విషయాలను గుర్తుకు చేసుకున్న సుమ ఎమోషనల్ అయింది. అదే ఈవెంట్ లో మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన ఆమె కొడుకు స్టేజి పైకి వచ్చి ఆమెను హత్తుకుని ఓదార్చారు.