ఎన్టీఆర్ మూవీతో చంద్రమోహన్ కు బ్యాడ్ ఎక్స్పీరియన్స్.. అసలు ఏం జరిగిందంటే.. ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కళమ్మ తల్లి ముద్దుబిడ్డ చంద్రమోహన్ ఇవాళ తుది శ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో రకాల పాత్రలో మెప్పించిన ఈయన కృష్ణాజిల్లా పమిడిముక్కల లో జన్మించారు, అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు కాగా ఇండస్ట్రీలోకి వచ్చాక చంద్రమోహన్ గా ఆయన పేరు మారింది. దాదాపు 55 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగిన ఆయన 900 పైగా సినిమాలలో నటించాడు. 150 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన ఈయన స్టార్ హీరోయిన్ అందరితో పనిచేశాడు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ తన పర్సనల్ లైఫ్ తో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన శోభన్ బాబు, నాగేశ్వరరావు, రామారావు ఆయనకు ఎంతో సన్నిహితులని చెప్పుకొచ్చిన ఆయన రామారావు మూవీ టైం లో ఆయనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ నాగేశ్వరరావు గారు నేను కలిసి ఇంచుమించు 40 సినిమాల్లో న‌టించామ‌ని.. అయితే రామారావు గారితో ఎక్కువగా సినిమా అవకాశాలు రాలేదు. కానీ ఓసారి ఎన్టీఆర్ గారి మూవీ వల్ల నేను ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను.

ఆ టైంలో ఎన్టీఆర్‌కు తమ్ముడుగా మొదట నన్ను సెలెక్ట్ చేశారు. ఇంత‌లో ఏమైందో తెలియదు కానీ చివరికి బాలయ్యను తీసుకున్నారు. ఆ టైంలో నేను చాలా బాధపడ్డా.. కానీ ఆ తర్వాత అదే సినిమాను తమిళంలో రీమేక్ చేసినప్పుడు ఎంజీఆర్ తమ్ముడిగా నేను అవకాశం అందుకున్నాను. ఎన్టీఆర్ సినిమా సెట్ లో జరిగిన ఘటన వల్లే నాకు ఆ చాన్స్ వచ్చింది. ఈ సినిమా వల్లే నాకు తమిళంలో మంచి క్రేజ్ కూడా దక్కింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చివరిగా గోపీచంద్ నటించిన ఆక్సిజన్ మూవీలో న‌టించాడు. త‌ర్వాత అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇండ‌స్ట్రీకి దూరంఅయ్యారు.