చెర్రీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ” గేమ్ చేంజర్ ” సాంగ్ వాయిదా..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతుంది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్‌ ఇండియా సూపర్ హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో అది కూడా మావేరిక్ డైరెక్టర్ శంకర్ – చెర్రీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం గడుస్తున్న ఇంకా సినిమాపై ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో చెర్రీ ఫాన్స్ మూవీ టీం పై ఫైర్ అవుతున్నారు. అయితే కొన్ని వారాల క్రితం ఈ సినిమాకు సంబంధించిన జరగండి జరగండి సాంగ్ దీవాలి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సాంగ్ ని వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్ ప్రెస్ నోట్ తో కన్ఫామ్ చేశారు మేక‌ర్స్‌. ఇక గతంలో పలు రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి.

సాంగ్ ఇప్పుడే రాదు, సింగర్ మారాడు, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి.. ఇలా ఎన్నో కారణాలతో సాంగ్ పోస్ట్ చేస్తున్నారంటూ చెర్రీ ఫ్యాన్స్‌కు దీపావళి కానుక రాదంటూ కామెంట్లు వినిపించాయి. అలాగే మేకర్స్ కూడా అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా వాయిదా పడినట్టు అనౌన్స్ చేశారు. అయితే సాంగ్ మరో డేట్ లో లాంచ్ చేస్తామని కచ్చితంగా గేమ్ చేజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి నిమిషానికి తగ్గట్టుగా సినిమా ఉండబోతుంది అంటూ నిర్మాణ సంస్థ ద్వారా వివ‌రించాడు. కాగా ఈ సాంగ్ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేయలేదు.