” రీజన్ ఏంటో తెలియదు… ఆయనను ఎప్పుడు చూసినా ఆ ఫీలింగే కలిగేది “… పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్…!!!

ప్రముఖ టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన హైదరాబాద్ అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతూ ఈరోజు (శనివారం ) ఉదయం 9:45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్, మంచు విష్ణు, నారా లోకేష్ సంతాపం తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ హోమ్ ప్రకటన కూడా విడుదల చేశారు.

” చంద్రమోహన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని కోరుతున్నాను. ఆయన్ని తెరమీద చూడగానే ఎంతో పరిచయం ఉన్న బంధువును చూసినట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారితో మా కుటుంబానికి స్నేహ బంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి సినిమాలలో నటించారు. నా మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ‘ సినిమాలో కూడా మంచి పాత్ర పోషించారు.

తమ్ముడు సినిమాలో మా ఇద్దరి మధ్య అలరించే సన్నివేశాలు. చంద్రమోహన్ గారు 900 కి పైగా సినిమాలలో నటించారు. ఆయనకి నాకు ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలియదు కానీ ఆయనను చూస్తే ఏదో ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు ప్రేక్షకులతో అన్ని తరాల వారికి చేరువయ్యారు. శ్రీ చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ” అంటూ పవన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.