చంద్ర‌మోహ‌న్ ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్‌ ఏంచేశారో తెలుసా.. చివ‌రి సినిమాకు ఆయ‌న కెమ్యున‌రేష‌న్ ఎంతంటే..

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం మృతి చెందారు. ఆయన తన సినీ కెరీర్‌లో 965 సినిమాలకు పైగా సినిమాలలో నటించాడు. 150క‌పైగా సినిమాలకు హీరోగా నటించిన చంద్రమోహన్ హీరో గానే కాకుండా విలన్ గా క్యారెక్టర్,, ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన తన కెరీర్ లో మొదటి, చివర రెమ్యూనరేషన్లు ఎంత..? ఆయన మొదటి రెమ్యూనరేషన్ ఏం చేశారో..? ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ మాట్లాడుతూ తన సినీ కెరీర్, పర్సనల్ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ తను మొదట రెమ్యూనరేషన్ గా రూ.3 వేలు పుచ్చుకున్నానని.. అలా ఆయన హీరోగా నటించిన మొదటి మూడు సినిమాల రెమ్యూనరేషన్లు కలిపి నా చెల్లెళ్ల పెళ్లి చేశానని.. నా తండ్రి చనిపోయిన తర్వాత చెల్లెళ్ల బాధ్యత నాపై పడిందని.. ఆ ఇద్దరు చెల్లెళ్లకు నా మొదటి మూడు రెమ్యూనరేషన్లు వాడి చాలా ఘనంగా పెళ్లి చేశానని అప్పట్లో రూ.10 నుంచి 15 వేలు అంటే చాలా ఎక్కువ అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా మొదటి సినిమా హిట్ అయిన తర్వాత బంగారు పిచ్చుక, బాంధవ్యాలు సినిమాలకు రెండు సినిమాలకు ఐదువేల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.

మొదట్లో నిర్మాత ఈ సినిమాకు మీకు ఎంత రెమ్యూనరేషన్ కావాలి అని అడగగా ఐదు వేల రెమ్యునరేషన్ ఓకేసారి ఇవమ‌ని.. చెల్లి పెళ్లి ఉందని చెప్పుకొచ్చాడట. చెల్లి పెళ్ళంటున్నావు కదా ఐదువేల తీసుకో అని ఆ మూవీ నిర్మాత ఆయనకు రూ.5 వేలు రెమ్యూనరేషన్‌ ఇచ్చాడని అప్పటినుంచి తర్వాత సినిమాలకు రూ.5వేల‌ ని తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. అలా పారితోష‌కం పెరుగుతూ వ‌చ్చింద‌ని చివరగా నటించినా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ కు నేను ఎక్కువ రెమ్యూనరేషన్లు తీసుకున్నాన‌ని చెప్పాడు. చివ‌రిగా ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాన‌ని వివ‌రించాడు.