వెబ్ సిరీస్ తో సక్సెస్ అయ్యేలా ఉన్న చైతు.. దూత ట్రైలర్ అదుర్స్..!!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మొదట్లో పలు సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో తాను నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో వెబ్ సిరీస్ వైపు అడుగు వేయగా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం దూత అనే వెబ్ సిరీస్ ని మొదలుపెట్టారు ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయలేదు ఈ రోజున నాగచైతన్య బర్త్డే సందర్భంగా దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ సైతం విడుదల చేశారు చిత్ర బృందం.

డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన ట్రైలర్ విషయానికి వస్తే.. మర్డర్ మిస్టరీగా సాగే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నాగచైతన్య ఇందులో జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. అంతేకాకుండా ఒక క్రైమ్ లో తనకు సంబంధం లేకుండా తనని ఇరికించినట్టుగా కనిపిస్తోంది.

ఒక పేపర్ కార్టూన్ లో చూపించిన విధంగా మర్డర్లు చేయడం ఆ మర్డర్లని నాగచైతన్య పైన వేయడం వంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. మరి ఈ కేసుల నుంచి చైతన్య ఎలా బయటపడతారనే విషయం తెలియాలి అంటే డిసెంబరు ఒకటి వరకు ఆగాల్సిందే.. దూత ట్రైలర్ చూసిన పలువురు అభిమానులు కచ్చితంగా నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ తో కంబ్యాక్ ఇస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే తాను తండెల్ అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మత్స్యకారుల జీవిత కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు గీత ఆర్ట్స్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తోంది.