అన్ని సినిమాలలో రొటీన్‌గా క‌నిపిస్తుందంటూ.. శ్రీ లీల గాలి తీసేస్తున్న ప్రేక్షకులు…!!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల. ఈ ముద్దుగుమ్మ ” పెళ్లి సందడి ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి..” ధమాకా ” తో సూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా వచ్చిన ” భగవంత్ కేసరి” సినిమాలో బాలయ్యకి కూతురుగా నటించి ప్రశంసలు అందుకున్న ఈమె…” ఆదికేశవ ” సినిమాతో నవంబర్ 24న మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది.

 

ఇక తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూసిన‌ ప్రేక్షకులు ఊహించని విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలలో శ్రీ లీల రొటీన్ పాత్రలు చేస్తుందని.. నటనలో కూడా ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదని కామెంట్లు చేస్తున్నారు. ధమాకా నుంచి స్కంధ‌ వరకు రొటీన్ పాత్రలలో కనిపిస్తుందని విమర్శిస్తున్నారు.

ఇక వరస అవకాశాలు అందుకోవడం గొప్పకాదు నటనలో ప్రతిభ కనపర‌చడం ముఖ్యం అంటూ ఫైర్ అవుతున్నారు. కనీసం మహేష్ తో నటిస్తున్న ” గుంటూరు కారం ” సినిమాలో అయినా శ్రీ లీలా పాత్ర బాగుండేలా చూసుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. ఫ్యూచర్లో ప్రభాస్‌తో జతకడుతుంది కాబట్టి ఇప్పటికైనా యాక్టింగ్ లో మార్పులు రావాలని.. లేదంటే ఎక్కువకాలం తెరపై కనిపించలేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు.