టాలీవుడ్ లో స్టార్స్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. రైటర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. తక్కువ సమయంలోనే టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, దరిద్రం ఏంటంటే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు బోయపాటి పరిస్థితి దారుణంగా మారింది.
టాప్ హీరోల సంగతి అటుంచితే యంగ్ హీరోలు కూడా బోయపాటితో సినిమా అంటే భయపడుతున్నారు. ఇందుకు కారణం ఇటీవల విడుదలైన `స్కంద` మూవీనే. బాలయ్యతో అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత బోయపాట శ్రీను తన తదుపరి చిత్రాన్ని రామ్ తో ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోతారు. బోయపాటి సినిమాతో రామ్ టాప్ హీరోల లిస్ట్ తో చేరిపోతాడని అంతా భావించారు. కానీ, ఎన్నో అంచనాల నడుమ విడుదలైన స్కంద డిజాస్టర్ అయింది.
రామ్ అనవసరంగా బోయపాటితో సినిమా చేశాడని ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. ఎంతసేపు బోయపాటి శ్రీను మాస్ సీన్లను మాత్రమే నమ్ముకుంటాడు. ఏ హీరోలకు ఎలాంటి సీన్లు పెడితే బాగుంటుందనేది పట్టించుకోడు. ఈ క్రమంలోనే బోయపాటి మాస్ కథలు బాలయ్యకు మాత్రమే వర్కోట్ అవుతాయని.. మిగిలిన హీరోలకు సెట్ కావానే టాక్ వచ్చేసింది. దీంతో బోయపాటి శ్రీనుతో సినిమా అంటే యంగ్ హీరోలు సైతం వణుకుతున్నారని ఇన్‌సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది.