సరిపోదా శనివారం అనే టైటిల్ తో 31వ సినిమా.. టైటిల్ గ్లింప్స్ వైరల్..!!

ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు హీరో నాచురల్ స్టార్ నాని.. ఇటీవల యాక్షన్ ఫిలిమ్ దసరా తో పాన్ ఇండియా హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే తన 30 వ సినిమా హాయ్ నాన్న అనే ఒక క్లాసికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల క్రితమే నాని 31 వ సినిమాని సైతం అధికారికంగా ప్రకటించారు.. నానితో గతంలో అంటే సుందరానికి ఇలాంటి కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ నాని 31 వ సినిమాని ప్రకటించడం జరిగింది.

Dvv ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. నాని 31వ సినిమా టైటిల్ సరిపోదా శనివారం అని వెరైటీ టైటిల్ తో తీసుకురావడం జరుగుతోంది. ఈ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఇందులో నాని ఇనుప సంఖ్యలతో ఒక పాత గోడౌన్ లో కట్టిపడేయడం చూడవచ్చు.

 

సాయికుమార్ వాయిస్ తో ప్రతి ఒక్కరికి టైం వస్తుంది ఒకరోజు వస్తుంది అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రతి శనివారం హీరోకి ఏం టైం వస్తుందో అనేకదాంశంతో కొత్తగా యాక్షన్ తో చూపించబోతున్నట్లు డైరెక్టర్ ఆత్రేయ కనిపిస్తోంది. అంటే సుందరానికి అనే సినిమాలో కామెడీ లవ్ తో మెప్పించిన ఈ కాంబో ఈసారి యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా గ్లింప్స్ వైరల్ గా మారుతోంది.