” స్టార్ మా ” లో ప్రసారం కాబోతున్న ఆదిపురుష్.. ఎప్పుడంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ” ఆది పురుష్ ” సినిమాతో డిజాస్టర్ ని దక్కించుకున్నాడు.

ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణంలోని కొన్ని ప్రధాన ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వరల్డ్ వైడ్ గా సుమారు 7 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఇక ఓటీటీలో కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అయితే తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ ” స్టార్ మా ” లో అక్టోబర్ 29 నుంచి సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం కానుంది. ఇక ప్రభాస్ తాజాగా నటిస్తున్న మూవీ ” సలార్ “. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.