వరుణ్-లావణ్య పెళ్లికి వెళ్తున్న నాగచైతన్య-సమంత ..పిక్స్ వైరల్..!!

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న ఆయన నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు.

ఇప్పటికే పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . అయితే రీసెంట్గా ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . వాళ్లలో మరీ ముఖ్యంగా సమంత – రష్మిక మందన్నా – నాగచైతన్య పేర్లు ట్రెండ్ అవుతున్నాయి . వీరందరూ నిన్న వేరువేరుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళందరూ ఇటలీ వెళుతున్నట్లు తెలుస్తుంది . వరుణ్ తేజ్ వీళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారట . దీంతో ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మొత్తానికి ఇటలీలో పెళ్లి చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రముఖులు హాజరు కాబోతుండడం గమనార్హం..!!