రతిక ఎలిమినేట్.. ఉన్నన్ని రోజులు రెమ్యూనరేషన్ గట్టిగానే ముట్టింద‌ట‌..!!

బిగ్ బాస్ 7 చూస్తున్న వాళ్లకు ఇది నిజంగా షాక్. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఓట్లు తక్కువగా రావడంతో నాలుగో వారమే హౌస్ నుంచి బయటికి వ‌చ్చేసింది. ఈ నేప‌ద్యంలో ర‌తిక కన్నీళ్లు పెట్టుకుంది. దీనిబట్టి హౌస్ లో ఉండాలని ఆమె ఎంతగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ బయటకు రాక తప్పలేదు. అయితే తొలి వారం నుంచి కెమెరాలు అన్ని తనపై ఫోకస్ అయ్యేలా చేసుకున్నా రతిక.. ఎక్కువ రోజులు ఉండలేకపోయింది.

గేమ్స్, టాస్కుల విషయానికి వచ్చేసరికి.. పెద్దగా కనిపించలేదు. ఎందులోనూ విజయం సాధించలేకపోయింది. ఇక రెండోవారం రతిక.. సొంత టీం సభ్యులనే బ్లేమ్ చేసింది. ఇక బిగ్ బాస్ లోకి వచ్చిన వెంటనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో బాగా ఆడుకుంది. వీళ్ళిద్దరూ ప్రేమ పక్షులు అనే రేంజ్ లో రెచ్చిపోయారు. తీరా రెండోవారానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. ప్రిన్స్ తో ప్రేమ లాంటి వ్యవహారం కూడా నడిపింది.

ప్రశాంత్, ప్రిన్స్ తో క్లోజ్ గా ఉంటూనే వాళ్లకి వెన్నుపోటు పొడిచింది. అది ఆమెకు గేమ్ ప్లాన్ ల అనిపించొచ్చు కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. అందువల్లే ఆమెని ఎలిమినేట్ చేశారు. నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతిక..వారానికి రూ. 2 లక్షలు చొప్పున అంటే నాలుగు వారాలకు కలిపి రూ. 8 లక్షలు సొంతం చేసుకుందని సమాచారం. కానీ టైటిల్ ఫేవరెట్ అనుకున్న ఈ బ్యూటీ.. ఇంత త్వరగా ఎలిమినేట్ అయినా రెమ్యూనరేషన్ మాత్రం బాగానే ముట్టిందంటు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ‌