క్రేజీ కాంబినేషన్‌లో కొత్త మూవీ.. విఘ్నేష్‌ శివన్ డైరెక్షన్‌లో ఎంఎస్ ధోని..

నయనతార భర్త విఘ్నేష్‌ శివన్ ఓ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ల్లో ఒకడైన విఘ్నేష్‌ శివన్‌కి కోలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా విఘ్నేష్‌.. స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి పెద్ద ఫ్యాన్. తను ఎంతగానో ఆరాధించే ఎమ్‌.ఎస్. ధోనిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. సరిగా అలాంటి అరుదైన అవకాశం విఘ్నేష్‌కి దక్కింది.

 

ఇక ఎం.ఎస్. ధోనిని డైరెక్ట్ చేసే అవకాశం విఘ్నేష్‌ శివన్‌కి వచ్చిందా.. ఆ అవ‌కాశం ఏమై ఉంటుంది అనుకుంటున్నారా.. వీరిద్దరూ యాడ్‌ షూట్ కోసం ఇలా ఒకచోట చేరారట. యాడ్స్‌లో భాగంగానే ధోనీకి సీన్ వివరిస్తున్న స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. నేను ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తున్నానో అలాంటి రోల్డ్ మోడల్‌కు దర్శకత్వం వహించడం.. నేను ఇష్టపడే స్టార్ కు యాక్షన్ చెప్పడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది అంటూ క్యాప్షన్ ట్యాగ్ చేశాడు.

తమిళనాడులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రియాలిటీ ఎస్టేట్ కంపెనీ జి స్క్వేర్ హౌసింగ్ కోసం ఈ టీవీ కమర్షియల్ యాడ్ ను రూపొందిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం హోం బ్యానర్ ధోని ఎంటర్టైన్మెంట్స్‌లో ఎల్‌జీఎం సినిమాను తెర‌కెక్కించి భార్య‌ సాక్షితో కలిసి ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టాడు ధోని. ఇక గ‌తంలో ధోని సంతకం చేసిన విఘ్నేష్‌ శివన్‌ టీషర్ట్ వీడియో తెగ‌ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక‌ ప్రస్తుతం లవ్ టు డే ప్రదీప్ రంగనాథ్‌తో తన నెక్స్ట్ సినిమా రూపొందించబోతున్నాడు విఘ్నేష్‌ శివన్‌.