ప్రతి పుట్టినరోజుకి ప్రభాస్ కి మొదట విష్ చేసేది ఆయనే.. ఆ తరువాతే అమ్మ, అనుష్క..!

నేడు మన డార్లింగ్ ప్రభాస్ 44వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజుకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ను ఆయనకు సంబంధించిన కొన్ని వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . కాగా సాధారణంగా మన పుట్టినరోజు అంటే మనకి చాలా కావాల్సిన వాళ్ళు దగ్గరగా ఉండేవాళ్ళు కరెక్ట్ గా ఫస్ట్ విషెస్ అందజేస్తూ ఉంటారు .

అయితే ప్రభాస్ కి మాత్రం ప్రతిసారి తన పుట్టిన రోజుకి ఫస్ట్ విషెస్ చెప్పేది ఓ స్పెషల్ పర్సన్ అంటూ తెలుస్తుంది . అది తన అమ్మగారు కాదు తన బ్లడ్ రిలేషన్ కాదు. కానీ ఆయనకి అతగాడు అంటే చాలా చాలా ఇష్టం . ఇప్పటికే ఆయన ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది . ఎస్ మీ గెస్సింగ్ కరెక్ట్ .. అది గోపీచంద్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాంచో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న గోపీచంద్.. ప్రభాస్ జాన్ జిగిడి దోస్తులు  అన్న విషయం తెలిసిందే .

ఎప్పుడైతే గోపీచంద్ – ప్రభాస్ ఫ్రెండ్స్ అయ్యారో అప్పటినుంచి ప్రతి పుట్టినరోజుకు ప్రభాస్ కి మొదట విష్ చేసేది గోపీచంద్ నే.. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన మిస్ చేసుకోడట . అంత పిచ్చి ప్రభాస్ అంటే గోపీచంద్ కి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు మీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం అంటూ ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అందజేస్తున్నారు..!