మోక్షజ్ఞ ఎంట్రీపై తేల్చేసిన బాల‌య్య‌.. ఆ టాప్ సీక్రెట్ కూడా బ‌య‌ట పెట్టాడుగా…!

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య బాలయ్య కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని ప్రకటించాడు. తాజాగా బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మళ్ళీ ఓపెన్ అయ్యారు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో పాల్గొన్న బాలయ్యతో హీరోయిన్ శ్రీ లీల ” మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ” అని అడిగింది. సమాధానంగా బాలయ్య స్పందిస్తూ.. ” వచ్చే ఏడాదే మోక్షజ్ఞ సినిమా ఉంటుంది ” అని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.

బాలయ్య కథ గురించి కూడా మాట్లాడుతూ..” నేను రాసిన ఆదిత్య 999 మ్యాక్స్ కథ ఒకటి. ఈ కథను నేను ఒక రాత్రిలో రాసేసాను. అలాగే ఇంకో కథ కూడా ఉంది. మరికొన్ని కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, ఏ కథతో మోక్షజ్ఞ మొదటి సినిమా తెరకెక్కుతుంది అనేది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ వచ్చే ఏడాది వాడు హీరోగా వస్తాడు ” అని బాలయ్య చెప్పుకొచ్చాడు.

అయితే తన కొడుకు సినిమాకి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య రివీల్ చేయలేదు. నిజానికి 2017 లోనే తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం హీరో అయ్యే దశగా మోక్షజ్ఞ కసరత్తులు చేస్తున్నాడట. ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.