ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉన్న సినిమాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా అదే లవ్ – డ్రామాలు – యాక్షన్ సినిమాలు చేయడానికి ఏ హీరో ముందుకు రావడం లేదు . ఇలాంటి క్రమంలోనే సుకుమార్ బోల్డ్ స్టెప్ తీసుకొని మరి పుష్ప లాంటి సినిమాను స్టార్ హీరో బన్నీ చేత చేయించాడు. దీన్ని రిజల్ట్ ఎలా ఉందో మనకు తెలిసిందే.
ప్రెసెంట్ బన్నీ పేరు గ్లోబల్ స్థాయిలో మారు మ్రోగి పోతుంది . కాగా సుకుమార్ ఈ సినిమాను మొదటగా మహేష్ బాబు కోసం రాసుకున్నారు అని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబును మాస్ యాంగిల్ లో చూపిస్తే ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చేయని సాహసం చేసి సక్సెస్ కొట్టిన డైరెక్టర్గా సుకుమార్ పేరు చరిత్ర సృష్టిస్తుంది.
అయితే ఈ ఈ స్టోరీ నచ్చకపోవడంతో మహేష్ బాబు రిజెక్ట్ చేశారు . ఒకవేళ మహేష్ బాబు యాక్సెప్ట్ చేసి ఉంటే బన్నీ – ఫహద్ ఫజిల్ క్లైమాక్స్ సీన్ లో అండర్వేర్ తో నిలుచున్న పాత్రలో మనం మహేష్ బాబు ను చూడాల్సి వచ్చేది . ఈ విషయాన్ని ఇమేజినేషన్ కి గుర్తుచేసుకొని నవ్వేసుకుంటున్నారు ఫ్యాన్స్ . అసలు ఇలాంటి థాట్స్ నీకు ఎలా వస్తాయి రా బాబు ..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఓ డైరెక్టర్ కి ఉండాల్సిన విజువలైజేషన్ సుకుమార్ కి ఉంది అంటూ పొగిడేస్తున్నారు. అలా మహేష్ బాబు తప్పించుకున్నాడు బన్నీ ఇరుక్కుపోయాడు..!!