టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఖుషి తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది . పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది . ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా చాలా సరికొత్త లుక్స్ లో కనిపించాడు . అంతేకాదు ఆయనకు భార్య పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించబోతుంది అంటూ లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.
అయితే మృణాల్ కనిపించిన ఒకే ఒక్క షాట్ లో వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డ్రెస్ ఎక్కడో చూసినట్లుందే అని అనుకుంటున్నారు అందరూ ఎస్ మీరు అనుకున్నది నిజమే ..ఆ డ్రెస్ మీరు చూసింది సర్కారీ వారి పాట అనే సినిమాలో. ఆ సినిమాలో కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్ నే ఇది.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో మీకు క్లియర్గా అర్థం అయిపోతుంది . అయితే ఒక హీరోయిన్ కి వేసిన డ్రెస్ మరోక హీరోయిన్ కి వేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మరికొందరు పరశురాంకి ఆ డ్రెస్ అంత నచ్చేసిందా..? అందుకే కీర్తి సురేష్ కి వేసిన అదే డ్రెస్ ని మృణాల్ కి కూడా వేశాడా ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మొత్తానికి విజయ్ ఫ్యామిలీ స్టార్ లోకి కీర్తి సురేష్ కూడా ఎంట్రీ ఇచ్చేసింది అంటూ కొందరు కౌంటర్స్ వేస్తున్నారు..!!
దేవరకొండ ‘ఫ్యామిలీ’లో కీర్తి సురేష్ .. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదుగా..ఫోటోస్ వైరల్..!!
