కాజల్ అగర్వాల్ తో రాశి ఖ‌న్నా.. క్విన్స్ లా ఉన్నారంటూ కామెంట్లు..!!

టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్స్‌గా మంచి అవకాశాలతో అలానే విజయాలతో దూసుకుపోతున్న లిస్టులో కాజల్ అగర్వాల్, రాశిఖన్నా కూడా ఉంటారు. ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి, కమల్ హాసన్ తో ఇండియన్ 2, లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ మూవీస్ చేస్తుంది కాజల్.

మరోవైపు రాశి ఖ‌న్నా కూడా ఏమాత్రం తీసిపోదు తమిళ్‌లో అరణ్మణై 4, మేథావి, హిందీలో యోధ మూవీస్ చేస్తుంది రాశి ఖన్నా. అయితే అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా కాజల్ అగర్వాల్ ఇంటికెళ్లి ఆమె ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపిన పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రాశి ఖన్నా.

ఈరోజుకి చాలా కృతజ్ఞతలు ఎట్టకేలకు తనని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ రాశి ఖన్నా పెట్టిన పోస్ట్ కి..ఇటువంటి లవ్లీ, బ్యూటిఫుల్, డివైన్, పాజిటివ్ అమ్మయిని కలుసుకోవడం సరదాగా గడపడం ఎంతో సంతోషంగా ఉంది రిప్లై ఇచ్చింది కాజల్. కాగా ఆ సందర్భంలో ఇద్దరూ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పిక్స్ చూసిన అభిమానులు ఇద్దరు క్విన్స్ లా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.