ప్రభాస్, అనుష్క పెళ్ళి అగిపోడానికి కార‌ణం అదేనా.. ఇన్నేళ్లకు బయటపడిన అసలు గుట్టు…!!

అనుష్క, ప్రభాస్ జంట అందరికీ ఫేవరెట్. వీరిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని మాటిచ్చుకున్నారట. ఒకవేళ అలా జరగని పక్షంలో సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారట. మరి వీరిద్దరూ ఇప్పటివరకు పెళ్లి చేసుకోక పోవడానికి అసలు కారణం ఏంటో చాలా రోజులకి బయటకు వచ్చింది. వీరిద్దరికీ పెళ్లి జరగకపోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయమే కారణమట. వారిద్దరి జాతకాలు కలువ‌కపోవడంతో ప్రభాస్ తల్లి ఈ పెళ్ళికి అంగీకరించలేదట.

ప్రభాస్ తల్లి దేవుడిని, జాతకాలను బాగా నమ్ముతుందట. తల్లి మాటను జవదాటని శ్రీరాముడిలా ప్రభాస్ కూడా అమ్మ చెప్పిన మాట విని అనుష్కను పెళ్లి చేసుకోలేదని టైమ్స్ నౌ కథనంలో వెల్లడయింది. ” ఆదిపురుష్ ” సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్, కృతి సనన్ కెమిస్ట్రీ చూసి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. ఆ సమయంలో ప్రభాస్ పట్ల కృతి సనన్ కేరింగ్ చూసిన ప్రతి ఒక్కరూ వీళ్లు రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు.

ఈ విషయాన్ని అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్‌ను బాలయ్య అందరి ముందు అడిగేశాడు. అలాంటిది ఏం లేదని ప్రభాస్ తేల్చి చెప్పేశారు. దీంతో ఈ రూమర్ కు పుల్ స్టాప్ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ ప్రభాస్, అనుష్క పెళ్లి తెరమీదికు వచ్చింది. నిజంగా జాతకాలు కలవకపోతే వారిద్దరూ రహస్యంగా చేసుకున్న ప్రమాణం ప్రకారం జీవితాంతం ఒంటరిగా ఉండిపోతారా? అనేది చూడాలి.