ఫర్ఫ్యూమ్ ఉపయోగిస్తే.. పిల్లలు పుట్టరా..?

మారుతున్న కాలం కొద్ది మనుషులు కూడా తమ పద్ధతులను రోజురోజుకి మార్చుకుంటూనే ఉన్నారు.. ముఖ్యంగా ఎక్కడికైనా మనం బయటికి వెళ్లాలన్న ఫంక్షన్లకు వెళ్లాలన్న ఎక్కువగా పెర్ఫ్యూమ్ వంటివి ఉపయోగిస్తూ ఉన్నారు. కొంతమంది పెర్ఫ్యూమ్ తో చెమట దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే పర్ఫ్యూమ్ ని ఉపయోగించడం వల్ల అనారోగ్యం మెల్లమెల్లగా పెరుగుతుందని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పర్ఫ్యూమ్ ఎక్కువగా వాడడం అనేది స్రి ,పురుషులు ఇద్దరికీ చాలా హానికరమని పలువురి నిపుణులు తెలుపుతున్నారు.. పర్ఫ్యూమ్ స్మెల్ బాగుందని ఎక్కువగా ఉపయోగిస్తే తప్పకుండా ప్రమాదమేనట.ఈ పెర్ఫ్యూమ్ లో చాలా రసాయనాలను కలిగి ఉంటాయి ఇందులో పారాబెన్ అనే రసాయనం ఉంటుంది ఇది ఉండడం వల్ల ఈ స్ప్రే కొట్టుకున్న వారికి ఆరోగ్యానికి హానికరం చేస్తుంది.. ముఖ్యంగా పురుషులకు స్టెరాయిడ్ హార్మోన్లను పాడు చేస్తుందట. ఈ హార్మోన్లు క్షీణించినట్లు అయితే పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతినేలా చేస్తుంది. అందుచేత చాలామంది పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

మహిళలకు కూడా పెర్ఫ్యూమ్ వాడడం వల్ల శరీరంలో రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ ను దారి తీసేలా చేస్తుంది. రసాయనాల కారణాంక చర్మం దద్దుర్లు.. దురద తదితర అలర్జీల సైతం వస్తాయట. ఫర్ఫ్యూమ్ స్ప్రే చేసినప్పుడు ఆ స్ప్రే ఒంటిమిదే కాకుండా చుట్టూ గాలిలో వ్యాపిస్తుంది అందులో ఉన్న రసాయనాలు గాడిద కారణంగా ఆగాలి శ్వాస పీల్చినప్పుడు ఊపిరితిత్తుల మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది దీంతో ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి.

ఫర్ఫ్యూమ్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల తలనొప్పి తల తిరగడం తదితర సమస్యలు ఎదురవుతాయి.. అంతేకాకుండా శరీరంలో ఉండే నరాలు కూడా మెల్లగా దెబ్బతింటాయట. అయితే వీటికి అలవాటు పడ్డవారు పారాబెన్ అనే పదార్థం ఫర్ఫ్యూమ్ బాటిల్ మీద ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి.