రజినీకాంత్ చేయాల్సిన సినిమాని కమల్ హాసన్.. కమల్ చేయాల్సిన సినిమాని రజిని చేశారా.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లే..?!

స్టార్ హీరో రజినీకాంత్, కమలహాసన్ లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇద్దరు సూపర్ స్టార్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీ స్టార‌ర్ సినిమాలు కూడా తెర‌కెక్కి బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక వీరిద్ద‌కీ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేసి హిట్ కొట్టడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రజనీకాంత్ చేయవలసిన సినిమాలను కమల్‌హాసన్.. కమల్‌హాసన్ చేయవలసిన సినిమాలు రజనీకాంత్ చేసి ఇద్దరూ సినిమాలతో విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు అంటూ ఓ న్యుస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఓ లుకేద్దాం. కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటిగా శంకర్ రజనీకాంత్ తో తెరకెక్కించాలనుకున్నాడట. కానీ ఏవో కారణాల చేత రజనీకాంత్ ఈ సినిమాలో నటించలేకపోయారు. దీంతో కమలహాసన్ ఈ సినిమాలో నటించి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి.

ఇక అదే విధంగా రజనీకాంత్ నటించిన రోబో సినిమా కూడా శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించిన మొదట ఈ సినిమాలో కమలహాసన్ ని హీరోగా అనుకున్నాడట శంకర్. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటించలేకపోయాడు. దీంతో ఈ సినిమా రజినికాంత్ చేతికి వెళ్లడం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం జరిగింది. తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వచ్చి అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.