‘ జైలర్ ‘ మూవీ విలన్ వ‌ర్త్ వ‌ర్మా అరెస్ట్.. కారణం అదేనట..?

రజనీకాంత్ హీరోగా నటించిన మూవీ జైలర్. ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు వినాయకన్‌. జైలర్ సినిమాలో వర్త్ వ‌ర్మా అంటూ ప్రేక్షకులను అలరించిన వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వినాయక్‌న్‌ ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ లో గొడవకు దిగి రచ్చ రచ్చ చేసాడు. దీంతో పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. తమను ఇబ్బంది పెడుతున్నాడు అంటూ వినాయకన్‌ నివాసంలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు.

వారి ఫిర్యాదు మేరకు వినాయకన్‌ని పోలీస్ స్టేషన్ కి రప్పించామని.. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న వినాయక సహనం కోల్పోయి మాతో గొడవకు దిగాడు అంటూ వివరించారు.. నటుడితో వారించేందుకు పోలీసులు ప్రయత్నించినా మాట వినకపోవడంతో అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ఓ మోడల్ ను హెరాస్ చేశాడనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి జైలర్ మూవీలో నటించాడు.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక ప్రస్తుతం అపార్ట్మెంట్ వాసులను ఇబ్బంది పెడుతూ మరోసారి అరెస్టు అయ్యాడు వినాయకన్‌. మలయాళం నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్‌ తెలుగు ప్రేక్షకులకు కళ్యాణ్ రామ్ అసాధ్యుడు మూవీతో పరిచయం అయ్యాడు. ఇక తర్వాత తెలుగు సినిమాల్లో నటించని ఆయన ఇటీవల జైలర్ సినిమాలో వర్త్ వర్మ వర్త్‌ అంటూ ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీలో డాన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వర్మ డాన్స్ మీమర్స్‌కు తెగ ఉపయోగపడుతోంది. ఇక త్వరలోనే విక్రమ్ మూవీ దృవ న‌క్షేత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.