నటుడుగా నేను మళ్ళీ పుట్టింది ఆ డైరెక్టర్ వల్లే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్.. !!

ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కొన్ని రకాల కథలను మాత్రమే ఎంచుకుంటూ వాటిలో మాత్రమే చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడానికి వారు సిద్ధంగా ఉండరు. ఈ కారణంగా వారు కొన్నిసార్లు నష్టపోతుంటారు. అయితే మరి కొంతమంది హీరోలు మాత్రం సాహసం చేసి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటించి సక్సెస్ అందుకొని.. మంచి క్రేజ్ తెచ్చుకుంటారు. అలాంటి వారిలో రామ్ చరణ్ ఒకడు. అయితే ముందుగా రామ్ చరణ్ అని ఒకే రకమైన కథలను ఎంచుకున్న రంగస్థలం సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ ను ఎంచుకొని తనలోని ఓ కొత్త నటుడిని చూపించారు.

రంగస్థలం సినిమాలో చెవిటివాడైన‌ చిట్టిబాబు క్యారెక్టర్ లో నటించిన రామ్ చరణ్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. అప్పటివరకు రామ్ చరణ్ లో అంత మంచి నటుడు ఉన్నాడనే సంగతి చాలా మందికి తెలియదు. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమా స్టోరీ తో పాటు హీరో క్యారెక్టర్జేషన్ కూడా చాలా ముఖ్యం. ఇక రంగస్థలం సినిమాలో హీరో క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశాడు. అందుకే ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ కంటే చిట్టిబాబు పాత్ర మనకు బాగా కనిపించింది.

ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ మళ్లీ నటుడిగా పుట్టానని ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే అంతకుమించి ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా నటన పరంగా వేరియేషన్స్ అయితే ఉండవు. ఒకే రకమైన పాత్రలను చేసి ఒకే రకమైన ఎక్స్ప్రెషన్స్ తో ఉండేవాడు. కానీ రంగస్థలం సినిమాలో మాత్రం నవరసాలను పండించాడు. దీంతో తనని తను ప్రూవ్ చేసుకున్నానని.. ఈ విషయంలో సుకుమార్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటానని చాలా సందర్భాల్లో చెప్పాడు చెర్రీ.