తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడుగా అల్లు అరవింద్ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు.. అల్లు రామలింగయ్య కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు స్వతాహ గీత ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించారు. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు అల్లు అరవింద్. గతంలో ఎక్కువగా చిరంజీవి సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అల్లు అరవింద్ చూసుకునేవారట.. చిరంజీవి ఏ సినిమా చేయాలి ఏ విధమైన సినిమాలలో నటిస్తే ఆయన కెరియర్ కు బాగుంటుంది అనే విషయాలు మొత్తం అన్నీ కూడా అరవింద్ చూసుకునేవారట.
ఈ క్రమంలోనే ఒకరోజు చిరంజీవి, విశ్వనాథ్ గారితో సినిమా చేయాలనుకున్న సమయంలో అల్లు అరవింద్ చిరంజీవి గారితో మీతో విశ్వనాథ్ గారు ఒక సినిమా చేయాలనుకుంటున్నారని చెప్పి చిరంజీవి గారిని సినిమాకు ఒప్పించానని తెలియజేశారట .ఆ సమయంలో విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్లి..మితో చిరంజీవి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని చెప్పి తెలియజేయడం జరిగిందట. అలా వీరి కాంబినేషన్లో స్వయంకృషి, ఆపద్బాంధవుడు అనే సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.
అల్లు అరవింద్ ఒక ప్రోగ్రాంలో అసలు విషయాన్ని తెలియజేస్తూ విశ్వనాథ్ గారిని చిరంజీవి గారిని మోసం చేశానంటూ నవ్వుకుంటూ తెలిపారు.. అయితే ఇద్దరికీ సినిమా చేయాలని మనసులో ఉంది కానీ ఎవరు ముందుకు రావట్లేదు..దీంతో అరవింద్ ముందు పడి వీరిద్దరి కాంబినేషన్ను సెట్ చేసి మరి విజయాలను అందించేలా చేశానని తెలిపారు. అల్లు అరవింద్ కి ఉన్న తెలివితో పలు సినిమాలను ప్రొడ్యూసర్ గా చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం చాలా పెద్ద సినిమాలు చేస్తే బిజీగా ఉన్నారు అల్లు అరవింద్. ఈయన కుమారులలో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పేరు పొందగా.. అల్లు సిరీస్ అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు అల్లు బాబి నిర్మాతగా కూడా ఉన్నట్లు సమాచారం.