నడిరోడ్డు పై రొమాన్స్ చేస్తున్న జంట.. ఇదెక్కడి ట్రెండ్‌రా సామి అంటూ..

బీహార్ లోని గయా, ఉత్తరప్రదేశ్ లోని హాపూర్, షాజియాబాద్ లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృతి చేష్టలకు పాల్పడిన వీడియోలు గ‌తంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి మ‌రో ఘ‌ట‌న‌ శనివారం రాత్రి హైద‌రాబాద్‌ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై చోటు చేసుకున్నాయి. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా.. నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారు వాడుకున్నారు.

శనివారం రాత్రి ఎక్స్ప్రెస్ వేపై కియా కారులో శంషాబాద్ వైపు నుంచి మహదిపట్నం వైపు ప్రయాణిస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వేపై కారు ఉండగానే కారు తన సన్ రూప్ ఓపెన్ చేసుకున్న ఓ జంట అందులోంచి బయటకు నిలబడి పబ్లిక్ గానే కిస్సులతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆ కారు వెనక మరో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దృశ్యాలను తమ సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇది ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఉత్తరాదిలో నగరాల పట్టణాల్లో వీధుల్లో వికృతి చేష్టలకు పాల్పడిన జంటల్ని అక్కడ పోలీసులు సోషల్ మీడియాలోని వీడియోల ఆధారంగా పట్టుకొని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్స్ప్రెస్ వేపై ఈ జంట రొమేన్స్ విష‌యంలో ఇక్కడ పోలీసులు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.