దానికి మీ ఇద్దరూ పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు.. వర్మ పోస్ట్ వైరల్..!!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇటీవీల శ్రీలక్ష్మి అనే అమ్మాయి గురించి పోస్ట్ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆమెను శారీలో చూసి ఇంప్రెస్స్ అయినా వర్మ.. సినిమా కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అయితే వర్మ ” చీర ” సినిమా గురించి శ్రీలక్ష్మి చర్చంచినట్లు తెలుస్తుంది.

కానీ కథ మాత్రం చెప్పలేదని, స్క్రిప్ట్ విన్నాకే నిర్ణయం తీసుకుంటానని కేరళ మీడియాతో ఆమె మాట్లాడిందట. వర్మ పుణ్యమా అని ఈ కేరళ కుట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. ఇక వర్మ కూడా ఆమెను వదిలిపెట్టడం లేదు.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ గురించి మరోసారి పోస్ట్ పెట్టాడు. ఈసారి ఈ వీడియోలో శ్రీలక్ష్మి తో పాటు వీడియోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లను కూడా మెచ్చుకున్నాడు. మీరు సినిమాటోగ్రాఫర్ గా, ఆమె మోడల్ గా ఇద్దరూ పర్ఫెక్ట్ గా సెట్ అవుతారన్నట్టుగా వర్మ షేర్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.