ట్విస్ట్ ” బిగ్ బాస్ 7 ” లో అబ్బాస్, పృథ్వీరాజ్ ఎంట్రీ..!!

నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తెలుగు షో.. బిగ్ బాస్ 7. ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా అభిమానులని అలరిస్తుంది. మొన్నటి వరకు ఆడియన్స్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో రసవత్తంగా సాగుతుంది. అయితే బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు.

కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించి తాజాగా అప్డేట్ రానే వచ్చింది. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. ఈసారి బబ్లూ పృథ్వీ రాజ్, అబ్బాస్, వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్ పాల్గొంటున్నట్లు టాక్.

అలాగే రవీన దాహా, నివిషా, అనన్య రావు, మాయా కృష్ణన్, రంజిత్ , బావ చెల్లిదురై, కూల్ సురేష్, వాసుదేవన్, విష్ణు విజయ్, విచిత్ర, విక్రమ్, సందీప్ ఆంటోని తమిళ్ బిగ్ బాస్ సెవెన్ లో సెలెక్ట్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే ఈ సీజన్ ప్రారంభం వరకు వేచి చూడాల్సిందే.